హయత్ నగర్; అక్టోబర్, 27 (స్థానికం)
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ నేతృత్వంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపు కోసం చేపట్టిన పాదయాత్రలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.డంపింగ్ యార్డు కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, దానిని తరలించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఈ పాదయాత్రలో పాల్గొని ప్రజలకు మద్దతుగా నిలిచారు.ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ పాదయాత్రలో పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన సంఘీభావాన్ని తెలియజేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి