Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలి: ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్.

Updated : 27 Oct 2026 20:06 IST
As Preferred Source 1 min read
విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలి: ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్.

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బ్యాగులు, బూట్ల పంపిణీ.

రామన్నపేట, అక్టోబర్ 27 (స్థానికం ప్రతినిధి):

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్ విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలి: ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్.

Article Image

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బ్యాగులు, బూట్ల పంపిణీ.

రామన్నపేట, అక్టోబర్ 27 (స్థానికం ప్రతినిధి):

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రముఖి జగదీష్ విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news