Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

డంపింగ్‌ యార్డును తరలించాలి.ఎంపీ ఈటల పాదయాత్రకు బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ నాయకుల సంఘీభావం.

Updated : 27 Oct 2026 19:13 IST
As Preferred Source 1 min read
డంపింగ్‌ యార్డును తరలించాలి.ఎంపీ ఈటల పాదయాత్రకు బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ నాయకుల సంఘీభావం.

ఎదులాబాద్, అక్టోబర్‌ 27 (స్థానికం): జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును తరలించి, దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన పాదయాత్రకు బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. మంగళవారం ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమైన పాదయాత్రలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ (46), ఎల్‌బీనగర్‌ అధ్యక్షుడు ఎర్ర వినోద్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ గోపాల్‌ శర్మ, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు సంజీవరెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, రమణరెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

డంపింగ్‌ యార్డు సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేలా డంపింగ్‌ యార్డు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి, బాధితులతో సమావేశమైన అనంతరం ఈటల రాజేందర్‌ పాదయాత్రను కొనసాగించారు. మర్రిపల్లిగూడెం సహా పలు గ్రామాల్లో పర్యటిస్తూ డంపింగ్‌ యార్డు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మొత్తం 60 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పాదయాత్రలో తొలిరోజు 14 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావాలని బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ నాయకులు ఆకాంక్షించారు.

Sthanikam

డంపింగ్‌ యార్డును తరలించాలి.ఎంపీ ఈటల పాదయాత్రకు బీజేపీ జీఎస్ఐ డివిజన్‌ నాయకుల సంఘీభావం.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news