బీసీ బిడ్డ కాబట్టే చిన్నచూపు చూస్తున్నారా?
ఫౌండేషన్ ప్రతినిధి బండమీది కిరణ్ కుమార్ ధ్వజం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, ఉపాధి కల్పనే లక్ష్యంగా విస్తృత సేవలు అందిస్తున్న ఈఎల్ వి భాస్కర్ పై కొందరు ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేయడం తగదని ఈఎల్ వి ఫౌండేషన్ ప్రతినిధి బండమీది కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌లోని ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాచకొండ చరిత్రను చాటిచెప్పేలా దసరా ఉత్సవాలు నిర్వహించామని, సమాజానికి మేలు జరుగుతుంటే ఓర్వలేక కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. భాస్కర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇలాంటి చిన్నచూపు చూస్తున్నారా అని ప్రశ్నించారు.
రూ. కోట్లతో చేపట్టిన సేవా కార్యక్రమాలు:
పక్షవాతం బాధితులు 142 మందిని సొంత ఖర్చులతో బెంగళూరుకు తీసుకెళ్లి ఉచిత వైద్యం అందించగా, ఇప్పటికే 52 మంది పూర్తిగా కోలుకున్నారు. సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్ పాఠశాలలకు రూ.60 లక్షల విలువైన రెండు బస్సులు అందజేశాం. అల్లందేవిచెరువులో రూ.25 లక్షలతో పాఠశాల భవనం నిర్మించాం. యువతకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించాం.మునుగోడు ప్రజల సాగునీటి కష్టాలు తీర్చేందుకు శివన్నగూడెం రిజర్వాయర్ త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో భాస్కర్ కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ నాయకులు గుండె మహేష్, ఎలిజాల శ్రీను, పట్నం బాలకృష్ణ, ఓర్సు విజయ్, గంజి సురేష్, పందుల రవితేజ, రాసమల్ల ముత్యాలు, కంచర్ల ప్రేమ్ దాస్, శికిలమెట్ల హేమేందర్, వనం వీరస్వామి, మంచాల ప్రశాంత్, గంధమల్ల మురళి, వట్టికోట వంశీ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి