Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి.

Updated : 28 Oct 2026 07:20 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి.

CPS ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కిరణ్‌కుమార్‌ పిలుపు.

CPS రద్దు.. OPS పునరుద్ధరణ కోసం గొంతెత్తాలి.

హైదరాబాద్‌: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన CPS ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర CPS ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు, CPS రద్దు, పాత పెన్షన్‌ విధానం (OPS) పునరుద్ధరణ, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు సహచరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కిరణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి