Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ప్రజల భద్రతకు ‘మీ సురక్ష 2.0 – హాక్‌ ఐ’ ఇళ్లలో పనిచేసే వారి వివరాల నమోదు,

Updated : 28 Oct 2026 03:47 IST
As Preferred Source 1 min read
ప్రజల భద్రతకు ‘మీ సురక్ష 2.0 – హాక్‌ ఐ’ ఇళ్లలో పనిచేసే వారి వివరాల నమోదు,

ధ్రువీకరణకు ప్రత్యేక డిజిటల్‌ వేదిక.

500 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభం.. కార్యక్రమంలో పాల్గొన్న 700 మంది.

సరోూర్‌నగర్‌, అక్టోబర్‌ 27: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష 2.0 – హాక్‌ ఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని భాగ్యశ్రీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని వెబ్‌లింక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది హాజరయ్యారు. కమిషనరేట్‌ పరిధిలోని 500 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఏకకాలంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇళ్లలో పనిచేసే పనివారు, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, అద్దెకు ఉండేవారు, తాత్కాలిక నివాసితులు, ఇతర సేవా సిబ్బంది వివరాలను నమోదు చేసి ధ్రువీకరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే వినియోగంలో ఉన్న హాక్‌ ఐ అప్లికేషన్‌ ఆధారంగా మెరుగుపరిచిన డిజిటల్‌ వేదిక ద్వారా వివరాల నమోదు, రికార్డుల నిర్వహణను సులభతరం చేశారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.

ఈ సందర్భంగా కమిషనర్‌ బి. సుమతి మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పెట్రోలింగ్‌ సిబ్బంది, సెక్టార్‌ అధికారులను తెలుసుకొని వారితో నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో భద్రతను పెంపొందించేందుకు రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, హాస్టల్‌ నిర్వాహకులు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు పోలీసులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

4.06 లక్షల నివాస, సంస్థల సముదాయాల సర్వేమీ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కమిషనరేట్‌ పరిధిలో 4,06,318 నివాస, ఇతర సంస్థల సముదాయాలను సర్వే చేసి వర్గీకరించారు. అలాగే 71,045 మంది ఇంటి పనివారు, ఇతర సేవా సిబ్బంది వివరాలను నమోదు చేశారు. ధ్రువీకరించిన సమాచారంతో నేరాల నివారణ, దర్యాప్తులో పురోగతి, మహిళలు, వృద్ధులు, కుటుంబాల భద్రతకు మరింత సహకారం అందుతుందని పోలీసులు తెలిపారు.

ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే వారి వివరాలను స్వచ్ఛందంగా అప్లికేషన్‌లో నమోదు చేయాలని, సిబ్బంది మారినప్పుడు వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా, గోప్యంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ, ట్రాఫిక్‌ డీసీపీ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీ, అదనపు డీసీపీ (ఎస్‌ఓటీ), ఎల్‌బీనగర్‌ ఏసీపీతో పాటు కమిషనరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పలువురు పౌరులు తమ ఇళ్లలో పనిచేసే పనివారి వివరాలను అప్లికేషన్‌లో నమోదు చేశారు.

అధికారిక వెబ్‌సైట్‌: https://malkajgiripolice.telangana.gov.in/

Sthanikam

ప్రజల భద్రతకు ‘మీ సురక్ష 2.0 – హాక్‌ ఐ’ ఇళ్లలో పనిచేసే వారి వివరాల నమోదు,

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి