Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

సేవా కార్యక్రమాల్లో ముందున్న టీయూడబ్ల్యూజే.. కంగ్టిలో మెగా వైద్య శిబిరం

Updated : 28 Oct 2026 16:02 IST
As Preferred Source 1 min read
సేవా కార్యక్రమాల్లో ముందున్న టీయూడబ్ల్యూజే.. కంగ్టిలో మెగా వైద్య శిబిరం

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బాలాజీ అనురాధ ఆసుపత్రి సౌజన్యంతో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ శిబిరానికి 200 మందికి పైగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల సలహాలు, సూచనలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు జి. సత్యం, ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కంగ్టిలో ప్రజలకు అందుబాటులో ఆరోగ్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, ఉపాధ్యక్షుడు ఈ. వెంకటేశం, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి జావిద్, ఉపాధ్యక్షులు నుక్కల రాజు, రామ్ రెడ్డి, రమేష్ గౌడ్, బిరాదర్ సంగప్ప, నిసార్, సంయుక్త కార్యదర్శి జైపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి వీర రెడ్డి, మండల జర్నలిస్టులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సేవా కార్యక్రమాల్లో ముందున్న టీయూడబ్ల్యూజే.. కంగ్టిలో మెగా వైద్య శిబిరం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news