నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ ఆరోగ్య శిబిరాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వైద్యుల సూచనలను పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ యూనియన్ ప్రతినిధులు, పాత్రికేయులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నా
రు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి