మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని 127, 415 సర్వే నంబర్లలో ఉన్న భూములను పరిశీలించి, అర్హులైన పేదలకు ప్లాట్లు కేటాయించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే 415 సర్వే నంబరులో చెరువు కట్ట వైపు ఉన్న డ్యామ్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని శ్రీ మల్లన్న స్వామి ఆలయానికి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం, మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, గ్రామ అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పడమటి సంతోష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్శెట్టి పటేల్, ఇంద్రసేన రెడ్డి, సభ ప్రభు, గడీల సంగమేశ్వర్, ముస్తఫా, న్యాయవాది ఉస్మాన్, షంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మునిపల్లి మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహకు సర్పంచ్ రేణుక వెంకట్ వినతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి