సిర్గాపూర్ మండల రూప్ల తండాలో నిర్మిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ భవానీమాత ఆలయ నిర్మాణానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.1 లక్ష విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణానికి సహాయం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఆయన ఆదేశాల మేరకు జీఎంఆర్ బృందం సభ్యులు ఈ విరాళాన్ని అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్న గుఱ్ఱపు మచ్చేందర్‌కు రూప్ల తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం ఆలయ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బసవరాజు పటేల్, ప్రకాష్ పటేల్, రూప్ల తండా సర్పంచ్ శివరాం, మాజీ సర్పంచ్ వసంత్, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ సాగర్,నాయకులు తుకారాం,అభి పవర్,విజయ్,మారుతి నాయక్,రాజు నాయక్, పరశురాం,మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గుఱ్ఱపు మచ్చేందర్.. ఆలయానికి రూ.లక్ష సాయం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి