రామన్నపేట: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులను కలిసి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, మండల కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, మహమ్మద్ అక్రమ్, మోటి మహేష్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి