పుట్టపర్తి నగరంలోని చిన్నంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆర్డీఓ సువర్ణ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, అన్ని మున్సిపాలిటీలలో కౌంటింగ్ ప్రక్రియ ఏవిధంగా సాగుతుందనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి