Sthanikam - Truth Matters
Logo

నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం!

Updated : 03 Nov 2026 11:14 IST
As Preferred Source 1 min read
నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం!

నల్గొండ మున్సిపాలిటీలో ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు.

నల్గొండ మున్సిపాలిటీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పదవీ విరమణ అనంతరం మృతిచెందిన హెల్త్‌ అసిస్టెంట్‌ చామకూరి వెంకటేశ్వర్లు సర్వీసులో ఉండగానే మరణించినట్లు తప్పుడు తేదీతో డెత్‌ సర్టిఫికెట్‌ జారీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పత్రంతో పాటు నకిలీ ఆధార్‌ ఆధారంగా ఆయన కుమారుడు రాజు వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకం పొందినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ విచారణకు ఆదేశించారు. మృతుడి భార్య వసంత, హెడ్‌ కానిస్టేబుల్‌ సహా నలుగురిపై క్రిమినల్‌ కేసులకు సిఫార్సు చేయగా, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, వార్డు ఆఫీసర్‌ జనార్దన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్దుల్‌ ఖాదీర్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Sthanikam

నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి