Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఢిల్లీలో ‘ఓట్ల చోరీ’ నిరసన విజయవంతం: న్యాయవాది నాథన్ డానీ

Updated : 02 Nov 2026 23:31 IST
As Preferred Source 1 min read
ఢిల్లీలో ‘ఓట్ల చోరీ’ నిరసన విజయవంతం: న్యాయవాది నాథన్ డానీ

మానూర్ మండల కాంగ్రెస్ నాయకులు,న్యాయవాది నాథన్ డానీ మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో, ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు రక్షణ కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ఈ నిరసన ద్వారా నాయకులు తమ గళాన్ని వినిపించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మన ప్రాంతానికి చెందిన జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లి పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు న్యాయవాది నాథన్ డానీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రతి ఒక్కరి ఓటు హక్కుకు రక్షణ కల్పించేందుకు ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

Sthanikam

ఢిల్లీలో ‘ఓట్ల చోరీ’ నిరసన విజయవంతం: న్యాయవాది నాథన్ డానీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి