Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

జాతీయ స్థాయిలో తాజ్‌పూర్ గ్రామానికి గుర్తింపు.. సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

Updated : 03 Nov 2026 00:52 IST
As Preferred Source 1 min read
జాతీయ స్థాయిలో తాజ్‌పూర్ గ్రామానికి గుర్తింపు.. సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ దంపతులు జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తీసుకురావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం మేరకు వారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని తాజ్‌పూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సర్పంచ్ దంపతులను గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

జాతీయ స్థాయిలో తాజ్‌పూర్ గ్రామానికి గుర్తింపు.. సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ దంపతులు జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తీసుకురావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం మేరకు వారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని తాజ్‌పూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సర్పంచ్ దంపతులను గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి