పోలీసుల చొరవతో తొలగిన ట్రాఫిక్ అంతరాయం
మిర్యాలగూడెం రహదారిపై ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్ప బోల్తాపడింది. ఈ ఘటనతో రహదారిపై ధాన్యం చెల్లాచెదురుగా పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై పడిన ధాన్యాన్ని తొలగించి, మరో ట్రాక్టర్‌లోకి లోడ్ చేసేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి