Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

తాడ్వాయిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

Updated : 16 Nov 2026 20:45 IST
As Preferred Source 1 min read
తాడ్వాయిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద రూ.12 లక్షల వ్యయంతో మంజూరైన నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, అవసరమైన వసతులు అందించేందుకు నూతన భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారి వసంత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామానాయక్, వార్డు సభ్యులు దేశగాని లింగమ్మ, కొండమీది శైలజ, జిల్లేపల్లి సుమన్, మొలుగూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాడ్వాయిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

Article Image

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద రూ.12 లక్షల వ్యయంతో మంజూరైన నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, అవసరమైన వసతులు అందించేందుకు నూతన భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారి వసంత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామానాయక్, వార్డు సభ్యులు దేశగాని లింగమ్మ, కొండమీది శైలజ, జిల్లేపల్లి సుమన్, మొలుగూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి