చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
స్థానిక అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మల్లమ్మ (70) అనే వృద్ధురాలు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు.
ఆశ్రమ నిర్వాహకుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని శక్తి సదన్ సంస్థ ప్రతినిధులు గతంలో మల్లమ్మను రక్షించి, సంరక్షణ నిమిత్తం 16 నెలల క్రితం చౌటుప్పల్‌లోని అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆశ్రమ నిర్వాహకులు వైద్య చికిత్స అందిస్తుండగా, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలియకపోవడంతో ఆశ్రమ వైస్ ప్రెసిడెంట్ సరిపల్లి గణేష్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని భద్రపరిచి అంత్యక్రియల నిర్వహణకు చట్టపరమైన చర్యలు చేపట్టారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి