విద్యార్థులను బెదిరించి, దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ
సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నేలపట్ల హాస్టల్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న వార్డెన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అదనపు కలెక్టర్ కె. వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.వివరాల్లోకి వెళితే... నేలపట్ల హాస్టల్ వార్డెన్ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, 'చాకుతో కోడిని కోసినట్టు కోస్తా' అంటూ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డెన్ ప్రవర్తనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. దీనిపై ఈ నెల 2న తల్లిదండ్రులు వార్డెన్‌ను ప్రశ్నించగా సరైన స్పందన రాలేదని తెలిపారు.అనంతరం బాధితులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌తో పాటు 'చైల్డ్ హెల్ప్‌లైన్'కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ నెల 6న చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు హాస్టల్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించినప్పటికీ, విచారణ వివరాలను ఫిర్యాదుదారులకు తెలియజేయలేదని ఆరోపించారు. కొందరు అధికారులు, నాయకులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ స్వయంగా నేలపట్ల హాస్టల్‌ను తనిఖీ చేసి, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని దబ్బటి శేఖర్ కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి