Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Updated : 16 Nov 2026 17:29 IST
As Preferred Source 1 min read
అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

బోర్రెలగూడెం స్టేజి వద్ద ఘటన

ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి బోర్రెలగూడెం స్టేజి వద్ద మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ఆందోల్ మైసమ్మ దేవాలయం సమీపంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆ కారణంతోనే మరణించి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.​మృతుడిని గుర్తుపట్టిన వారు, అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు గానీ ఉంటే వెంటనే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు (8712662744) సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Sthanikam

అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news