Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి

Updated : 16 Nov 2026 17:04 IST
As Preferred Source 1 min read
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి

సర్వే నంబర్ 17 భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం.

గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించి, అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రామ రెవెన్యూ రికార్డులైన ఖస్రా పహాణి (1954–55)లో సర్వే నంబర్ 17లో మొత్తం 386 ఎకరాల 15 గుంటల భూమి నమోదై ఉందని తెలిపారు. అనంతర రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇందులో భూదాన్ యజ్ఞ బోర్డు భూమి, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ భూమి, సీలింగ్ ప్రభుత్వ భూములు, సీలింగ్ పట్టా భూములతో పాటు పట్టా భూములు ఉన్నట్లు వివరించారు.

సర్వే నంబర్ 17/1/2/0లో 75 గుంటల భూదాన్ భూమి, 17/2లో 61 గుంటల ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ భూమి, 17/3 నుంచి 17/18 వరకు 53 గుంటల సీలింగ్ ప్రభుత్వ, సీలింగ్ పట్టా భూములు, మిగిలిన 197 ఎకరాల 15 గుంటల పట్టా భూమి ఉన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

గతంలో తహసీల్దార్ కార్యాలయం జారీ చేసిన లేఖతో పాటు రెవెన్యూ రికార్డులను పరిశీలించి సర్వే నంబర్ 17లోని భూముల వర్గీకరణను స్పష్టంగా గుర్తించాలని కోరారు. ప్రభుత్వ, భూదాన్, సీలింగ్ భూములను వేర్వేరుగా గుర్తించి వాటి హద్దులను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూములను పరిరక్షించాలని సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ అంశంపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news