Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చౌటుప్పల్‌ మండల గ్రామ కాంగ్రెస్‌ కమిటీల రద్దు

Updated : 12 Nov 2026 18:50 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్‌ మండల గ్రామ కాంగ్రెస్‌ కమిటీల రద్దు

16 నుంచి 26 పంచాయతీల్లో కొత్త కమిటీల ఏర్పాటు: మండల అధ్యక్షుడు బోయ దేవేందర్‌

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

టీపీసీసీ ఆదేశాల మేరకు చౌటుప్పల్‌ మండల పరిధిలోని అన్ని గ్రామ కాంగ్రెస్‌ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్‌ ప్రకటించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.​ఈ నెల 16వ తేదీ నుంచి మండలంలోని 26 గ్రామాల్లో కొత్త కమిటీల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని దేవేందర్‌ వెల్లడించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కొత్త కమిటీల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, వైస్‌ ఛైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్‌ విండో ఛైర్మన్‌ ఈద్దుల మస్తాన్‌బాబు, ఆందోల్‌ మైసమ్మ దేవాలయ ఛైర్మన్‌ కంచర్ల అశ్విన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అర్ద వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ మండల గ్రామ కాంగ్రెస్‌ కమిటీల రద్దు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి