Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

15న నల్లగొండలో కిసాన్ సభ బహిరంగ సభ రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: సీపీఎం నేత కొండమడుగు నర్సింహ.

Updated : 12 Nov 2026 16:40 IST
As Preferred Source 1 min read
15న నల్లగొండలో కిసాన్ సభ బహిరంగ సభ రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: సీపీఎం నేత కొండమడుగు నర్సింహ.

అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 15న నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఎం శాఖ సమావేశం నిర్వహించి, బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

గతంలో రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును తిరిగి అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆక్వా, పౌల్ట్రీ, పాడి, ఆహార, ఉద్యాన పంటల రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను రైతులంతా ఐక్యంగా అడ్డుకోవాలని కోరారు.

అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు రద్దు, బలవంతపు భూసేకరణ నిలిపివేత తదితర డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 'వ్యవసాయాన్ని కాపాడుకుందాం.. రైతును రక్షించుకుందాం' అనే నినాదంతో నిర్వహిస్తున్న మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈనెల 15న జరిగే బహిరంగ సభకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం శాఖ కార్యదర్శి కొండ అశోక్, మండల కార్యదర్శివర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, గ్రామ నాయకులు, రైతులు కూకుట్ల కృష్ణ, కొండ లక్ష్మయ్య, కాసారం మల్లయ్య, కొండ ఐమావతి, కూకుట్ల చొక్కాకుమారి, గౌటి శారదమ్మ, బొడుసు పద్మ, కొండమడుగు సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి