Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి

Updated : 12 Nov 2026 18:27 IST
As Preferred Source 1 min read
ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు తగదు: బీఆర్‌ఎస్వీ నేత నలపరాజు రమేష్‌

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్‌ వ్యవస్థను రద్దు చేసి, 10+2 విధానంలో భాగంగా పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని బీఆర్‌ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోగాలకు వేదికగా మార్చవద్దని హితవు పలికారు. దశాబ్దాలుగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఇంటర్‌ వ్యవస్థలో కీలక మార్పులు చేసే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులతో విస్తృత స్థాయిలో చర్చించాలని సూచించారు. విలీన నిర్ణయంతో తలెత్తే పలు సందేహాలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల భవిష్యత్తు ఏమిటని, ప్రస్తుతం బోధిస్తున్న అధ్యాపకుల ఉద్యోగ భద్రత, సర్వీసు నిబంధనల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఈ మార్పు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు తగ్గకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలన్నారు.సైన్స్‌ విద్యార్థులకు అవసరమైన ల్యాబ్‌లు, ప్రత్యేక బోధనా సదుపాయాలు పాఠశాల స్థాయిలో ఎలా కల్పిస్తారని నిలదీశారు. అలాగే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల బోధనలో నాణ్యతను ఎలా కొనసాగిస్తారో వివరించాలన్నారు.​కేవలం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో విధానాన్ని మార్చినంత మాత్రాన నాణ్యమైన విద్య అందదని రమేష్‌ పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యా సంస్కరణలు విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించాలే తప్ప, ఉన్న వ్యవస్థపై అనిశ్చితిని సృష్టించకూడదని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Sthanikam

ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి