తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి అత్తగారి ఇంటి నుండి బయలుదేరిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా రెగోడ్ మండలం మార్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్పల్లి గ్రామానికి చెందిన మన్నె కిష్టయ్య పెద్ద కుమారుడు నవీన్‌కు ఆరేళ్ల క్రితం రేణుక (26)తో వివాహమైంది. వీరికి నిఖిత (5), నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం నవీన్ మరణించడంతో, రేణుక తన ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేటలో నివాసముంటోంది.దీపావళి పండుగ కోసం ఈ నెల 7న రేణుక తన పిల్లలతో కలిసి అత్తగారి ఊరైన మార్పల్లికి వచ్చింది. తిరిగి ఈ నెల 9న ఉదయం 9 గంటల సమయంలో జోగిపేటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే, ఆమె జోగిపేటకు చేరుకోకపోవడంతో పాటు, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు జోగిపేటతో పాటు బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మామ మన్నె కిష్టయ్య రెగోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై పి. పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేగోడు మండలంలో ఇద్దరు చిన్నారులతో సహా వివాహిత అదృశ్యం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి