వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ సీనియర్ ఉద్యమ నాయకుడు పోలేపల్లి సత్యనారాయణ.
చిట్యాల: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తీరని అన్యాయం జరిగిందని చిట్యాల పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ ఉద్యమ నాయకుడు పోలేపల్లి సత్యనారాయణ అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల జీవితాలు గత ప్రభుత్వ పాలనలో దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వేముల వీరేశం తమకు మార్గదర్శకుడిగా, దిశానిర్దేశం చేసే నాయకుడిగా ఉంటూ అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా ఉద్యమకారులకు తగిన న్యాయం చేయగల నాయకుడు వీరేశమేనన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనే విశ్వాసం తనకు ఉందన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి