ఇద్దరు నిరుపేదలకు ఆర్థిక సహాయం, నిత్యవసరాల పంపిణీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద మహిళల కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన బొడ్డు కవిత, చేపూరి సుస్మితల కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు నగదు పంపిణీ చేశారు.ఒక్కో కుటుంబానికి రూ.9,000 విలువైన కిరాణం సరుకులు, రూ.5,000 చొప్పున నగదును లయన్స్ క్లబ్ అధ్యక్షులు అతహర్ పాష చేతుల మీదుగా అందజేశారు. రెండు కుటుంబాలకు కలిపి మొత్తం రూ.28,000 విలువైన సహాయాన్ని పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊదరి యాదయ్య, లయన్స్ క్లబ్ కార్యదర్శి దాచేపల్లి రాజు, సభ్యులు నాంపల్లి రమేష్, కాసుల వెంకటేశం, కటికం ప్రశాంత్, సిలివేరు మంగయ్య, గోపగోని లక్ష్మణ్ గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి