Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఆజాద్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

Updated : 11 Nov 2026 19:29 IST
As Preferred Source 1 min read
ఆజాద్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసేందుకు అనేక విద్యాసంస్థలను స్థాపించి, విద్యా సంస్కరణలకు పునాదులు వేశారని కొనియాడారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఆజాద్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి