కోదాడ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిపించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కోదండ రామస్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి