Sthanikam - Truth Matters
Logo

ఒకచోట నీటి వృథా.. మరోచోట తాగునీటి కోసం తిప్పలు!

Updated : 11 Nov 2026 19:28 IST
As Preferred Source 1 min read
ఒకచోట నీటి వృథా.. మరోచోట తాగునీటి కోసం తిప్పలు!

చిట్యాల ఆరో వార్డు వెంకటాపురంలో తాగునీటి సరఫరాపై వివక్ష? అధికారుల తీరుపై స్థానికుల అసహనం.

జనావాసాల్లో నల్లా కనెక్షన్ల మూసివేత..

మరోవైపు నిరుపయోగ ప్రాంతాల్లో వృథాగా పారుతున్న నీరు

చిట్యాల: ఒకచోట తాగునీరు వృథాగా పారుతుంటే.. మరోచోట ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చిట్యాల మున్సిపాలిటీలోని ఆరో వార్డులో నెలకొంది. తాగునీటి సరఫరా విషయంలో మున్సిపల్ అధికారుల వ్యవహారశైలిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వార్డులో జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ల ద్వారా నీరు వృథాగా బయటకు ప్రవహిస్తుండగా, జనావాసాల మధ్య ఉన్న నల్లా కనెక్షన్లను సరిచేయాలని కోరితే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు పది రోజుల క్రితం జనావాసాల మధ్య ఉన్న నల్లా కనెక్షన్లను పూర్తిగా మూసివేశారని, బహిరంగంగా ఉన్న అన్ని నల్లా కనెక్షన్లను సైతం మూసివేస్తామని హెచ్చరించారని పేర్కొంటున్నారు.అయితే, ప్రస్తుతం జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో నల్లాల నుంచి నీరు వృథాగా పోతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అవసరమైన చోట కనెక్షన్లు నిలిపివేస్తూ, నీరు వృథా అవుతున్న చోట మాత్రం చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. ఈ విషయంలో అధికారుల చర్యలు స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొంటున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించాలని, వృథాగా పోతున్న నీటిని అరికట్టి, వార్డులోని ప్రజలందరికీ సమానంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరో వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

ఒకచోట నీటి వృథా.. మరోచోట తాగునీటి కోసం తిప్పలు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి