Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పేద విద్యార్థుల విద్యకు ప్రవాస భారతీయుడి చేయూత

Updated : 11 Nov 2026 19:29 IST
As Preferred Source 1 min read
పేద విద్యార్థుల విద్యకు ప్రవాస భారతీయుడి చేయూత

కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష ఫీజులు చెల్లించలేని 50 మంది నిరుపేద విద్యార్థులకు ప్రవాస భారతీయుడు పానుగంటి రుషి రాజా రూ.47 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. సులోచన రాణి మాట్లాడుతూ పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని, విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం గొప్ప సేవ అని అన్నారు. ఇలాంటి సహాయం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి వారి చదువుకు అండగా నిలిచిన రుషి రాజాను అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఫిజిక్స్ అధ్యాపకులు పానుగంటి రాజేష్‌ను ప్రశంసించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థుల విద్యకు ప్రవాస భారతీయుడి చేయూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి