Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడ అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

Updated : 11 Nov 2026 19:29 IST
As Preferred Source 1 min read
కోదాడ అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.5 కోట్లతో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ నూతన భవనం, రూ.8 కోట్లతో చేపడుతున్న ఆర్‌అండ్‌బీ శాఖ భవన నిర్మాణ పనులతో పాటు షాదీఖానా నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాలను నాణ్యతా ప్రమాణాలతో, ఆధునిక ఆర్కిటెక్చర్ డిజైన్లతో నిర్మించి పట్టణానికి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

Article Image

కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.5 కోట్లతో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ నూతన భవనం, రూ.8 కోట్లతో చేపడుతున్న ఆర్‌అండ్‌బీ శాఖ భవన నిర్మాణ పనులతో పాటు షాదీఖానా నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాలను నాణ్యతా ప్రమాణాలతో, ఆధునిక ఆర్కిటెక్చర్ డిజైన్లతో నిర్మించి పట్టణానికి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి