విద్యార్థులు, యువతకు ఎంతో ఉపయోగకరం: సబితా ఇంద్రారెడ్డి.
మహేశ్వరం, నవంబర్ 11 (స్థానికం):
మహేశ్వరం నియోజకవర్గంలోని గాయత్రి నగర్‌లో రూ.1.50 కోట్ల ప్రత్యేక నిధులతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ 59వ డివిజన్ గాయత్రి నగర్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భవనాన్ని నిర్మించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రంథాలయం స్థానిక విద్యార్థులు, యువతకు మంచి అవకాశంగా నిలుస్తుందని అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో అర్కల భూపాల్ రెడ్డి, మాజీ మీర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, దీప్లాల్ చౌహన్, సిద్దాల లావణ్య బీరప్ప, అనీల్ కుమార్ యాదవ్, లాడ్స్ స్కూల్ బీరప్ప, శ్రీను నాయక్, భూపేష్ గౌడ్, విజయ్, నర్సిరెడ్డి, అర్జున్, సహదేవ్, జంగయ్య, సుదర్శన్ రెడ్డి, యాదగిరి, శివమూర్తి, సునీతా బాల్ రాజ్, మాదరి రమేష్, సిద్దాల అంజయ్య, స్నేహలత, మాదేవి, సూరిలత, చారి, బాల్ రాజ్, గాయత్రి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఓల్డ్ గాయత్రి నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు, కాలనీవాసులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి