కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలి:న్యాయమూర్తి ఎం.డి. గౌస్ పాషా
న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ ఘన సన్మానం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
న్యాయవ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా న్యాయవాదులు నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని న్యాయమూర్తి ఎం.డి. గౌస్ పాషా సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.అనంతరం న్యాయమూర్తి ఎం.డి. గౌస్ పాషా మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వృత్తిపరమైన నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మక్తల నర్సింహా, న్యాయవాదులు అల్లి స్వాతి, దేశబోయిన శ్రీశైలం, నకిరేకంటి జ్యోతి, ఖయ్యుమ్ పాషా, పిల్లలమర్రి కిరణ్, సీనియర్ న్యాయవాదులు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఎలామోని శ్రీనివాస్, ముత్యాల సత్తిరెడ్డి, జెల్లా రమేష్, పాల పరమేష్, భరత్, చామట్ల జంగయ్య, మల్లికార్జున్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి