ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ఈ నెల 29న ఎల్బీనగర్‌లో కార్యక్రమం
జీవిత కాల సభ్యులకు మాత్రమే ప్రవేశం: నిర్వాహకులు
ఈ నెల 29న ఎల్బీనగర్‌లో WAM (వామ్) జీవిత కాల సభ్యుల కోసం 'వన సమారాధన - వనభోజనాలు' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు చైర్మన్ కౌటికె విఠల్, కో-చైర్మన్ మడుపల్లి రవి గుప్తా, తిరుమల గ్రూప్ అధ్యక్షుడు సింగిరికొండ నర్సింహా తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.ముఖ్య అతిథుల రాకతో కార్తీక మాస విశిష్టత, కార్తీక వనభోజనాల ప్రాధాన్యత మరింత పెంపొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వన సమారాధన కార్యక్రమంలో WAM లో ముందస్తుగా జీవితకాల సభ్యులుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ లేదా ప్రత్యేక ఆహ్వానం కలిగి ఉండాలని తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి