Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఆలేరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ.

Updated : 12 Nov 2026 18:42 IST
As Preferred Source 1 min read
ఆలేరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశం.

ఆలేరు, నవంబర్ 12 (స్థానికం ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ చెబ్రోలు లక్ష్మీనారాయణ ఆలేరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. పోలీస్ శాఖలో అమలవుతున్న వివిధ వర్టికల్స్ పనితీరును సమీక్షించి, వాటి అమలు తీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, సమస్యాత్మక ప్రాంతాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా స్పందించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ తనిఖీలో యాదాద్రి డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్, ఆలేరు ఎస్‌హెచ్‌ఓ ఉదయ్, ఎస్‌ఐ వినయ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆలేరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి