Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

‘థింక్ 2029’ సదస్సులో మధుయాష్కి గౌడ్

Updated : 12 Nov 2026 18:16 IST
As Preferred Source 1 min read
‘థింక్ 2029’ సదస్సులో మధుయాష్కి గౌడ్

ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు నూతన విధానాలు, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) జార్ఖండ్ శాఖ ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన ‘థింక్ 2029 – ప్రొఫెషనల్స్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్’ సదస్సులో ఏఐపీసీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాల పెంపు, విద్యారంగ అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణ, పాలనా సంస్కరణలపై విధాన రూపకర్తలు, పారిశ్రామిక రంగ నిపుణులు, వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే పలు సూచనలు చేశారు.

ఈ సదస్సులో ఏఐసీసీ జార్ఖండ్ రాష్ట్ర ఇన్‌ఛార్జి కె. రాజు, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, మంత్రి శిల్పి నేహా తిర్కీ, మాజీ కేంద్ర మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్, మాజీ మంత్రి బంధు తిర్కీ, సువీర్ సరన్, రాంచీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కుమార్ రాజా, ఆదిత్య విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘థింక్ 2029’ సదస్సులో మధుయాష్కి గౌడ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి