భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్‌లో గల సిద్ధార్థ ఐటీఐ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 40 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్, ఎంఆర్‌టీ ఇండస్ట్రీస్ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఇందులో ఎలక్ట్రీషియన్ విభాగం నుంచి 20 మంది, ఫిట్టర్ విభాగం నుంచి 10 మంది, డీజిల్ మెకానిక్ విభాగం నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కట్ట మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ పరిశ్రమల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి