Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

నారాయణగూడెంలో 49 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

Updated : 16 Nov 2026 20:46 IST
As Preferred Source 1 min read
నారాయణగూడెంలో 49 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాంపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 49 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. వీరిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు ఉన్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణగూడెంలో 49 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

Article Image

మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాంపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 49 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. వీరిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు ఉన్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి