Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు.. వార్డు సభ్యులకు సంక్షేమ పథకాలు కల్పించాలి

Updated : 16 Nov 2026 20:46 IST
As Preferred Source 1 min read
ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు.. వార్డు సభ్యులకు సంక్షేమ పథకాలు కల్పించాలి

మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో నరేష్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షుడు సూరేపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ వార్డు సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో ఉండగా వార్డు సభ్యులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఆరోగ్య కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

Sthanikam

ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు.. వార్డు సభ్యులకు సంక్షేమ పథకాలు కల్పించాలి

Article Image

మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో నరేష్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షుడు సూరేపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ వార్డు సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో ఉండగా వార్డు సభ్యులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఆరోగ్య కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి