చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
గుడిమల్కాపురం గ్రామం లో
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొండ బాలరాజ్ గౌడ్ కుటుంబానికి స్థానిక గౌడ యువత అండగా నిలిచింది. ఆపదలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో యువకులందరూ కలిసి సేకరించిన రూ.19,600 ఆర్థిక సహాయాన్ని సోమవారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్టకాలంలో తోటి కుటుంబానికి భరోసా కల్పించడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు యువత పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామస్థులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి