మోతె మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ - 2 లో సందడి వాతావరణం నెలకొంది. చిన్నారి పుట్టినరోజును పురస్కరించుకుని అంగన్వాడీ చిన్నారులకు ఉపయోగపడేలా కుర్చీలు బహుకరించడం అందరినీ ఆకట్టుకుంది.
సూర్యాపేట జిల్లా స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ స్వేరో దీపిక ల కుమార్తె జిల్లపల్లి హెలీనా జన్మదిన సందర్భంగా అంగన్వాడీ చిన్నారులకు 20 కుర్చీలను బహుకరించారు. చిన్నారులు కూర్చుని చదువుకునేందుకు, ఆటపాటల్లో పాల్గొనేందుకు ఈ కుర్చీలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ దోసపాటి పద్మ మాట్లాడుతూ.. మా అంగన్వాడీ కేంద్రానికి దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాతల సహకారంతోనే అంగన్వాడీ కేంద్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని, ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
చిన్నారి హెలీనాకు అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి