కోదాడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్లు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చర్యలు చేపట్టారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 70 వాహనాలను అదుపులోకి తీసుకొని జరిమానాలు విధించారు. అనంతరం పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ వాహనదారులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు పాటించాలని కోరారు.
కోదాడలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి