Sthanikam - Truth Matters
Logo

నెల రోజుల్లో మోరీపై కప్పులు వేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష

Updated : 17 Nov 2026 16:05 IST
As Preferred Source 1 min read
నెల రోజుల్లో మోరీపై కప్పులు వేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష

చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డులోని పెద్ద మోరీపై నెల రోజుల్లోపు కప్పులు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో వార్డు ప్రజలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌ గురులింగం కు వినతిపత్రం అందజేశారు.10వ వార్డులో గోగీకారి సారంగం ఇంటి నుంచి ఎల్లమ్మ గుడి వరకు ఉన్న పెద్ద మోరీ ప్రమాదకరంగా మారిందని, అందులో పడి పలువురు మృత్యువాత పడగా, మరికొందరు వికలాంగులయ్యారని నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి లేఖ నంబర్ 99/MCCTL/2026, తేదీ 24-08-2026 ద్వారా వర్క్ ఆర్డర్ జారీ చేసినట్లు కమిషనర్ గతంలో తెలిపారని గుర్తుచేశారు. అయితే మూడు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల రోజుల్లోపు మోరీపై కప్పులు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాలని, 10వ వార్డులో మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గడువులోగా స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి చికిలం మెట్ల అశోక్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీనివాస్, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, పిల్లి రవి, దుడ్డు శ్రీకాంత్, అనుముల సందీప్, కంభంపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నెల రోజుల్లో మోరీపై కప్పులు వేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి