Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Updated : 17 Nov 2026 19:13 IST
As Preferred Source 1 min read
బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో బాలికల సాధికారత, కౌమార విద్య, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ వి. శ్రీలత మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, ఆత్మగౌరవంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ భవాని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని వివరించారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె. వీరబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Article Image

మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో బాలికల సాధికారత, కౌమార విద్య, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ వి. శ్రీలత మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, ఆత్మగౌరవంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ భవాని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని వివరించారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె. వీరబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి