Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పింఛన్ కార్డుల పంపిణీ

Updated : 17 Nov 2026 19:03 IST
As Preferred Source 1 min read
మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పింఛన్ కార్డుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 13వ వార్డు పరిధిలో అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు భర్తను కోల్పోయిన మహిళలకు, ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి నెల అందే పింఛన్ డబ్బులు వారి రోజువారీ అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, వార్డు అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పింఛన్ కార్డులు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, తమకు పింఛన్ కార్డులు అందించడంలో చొరవ చూపిన కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పింఛన్ కార్డుల పంపిణీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి