చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని ప్రభుత్వ సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కోరారు.
నారాయణపురం మండలం గుడిమల్కాపురంలోని బాలాజీ గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణపురం ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఏపీడీ నవీన్, గ్రామ కార్యదర్శులు, ప్రభుత్వ సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి