Sthanikam - Truth Matters
Logo

జిల్లా పరిషత్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Updated : 17 Oct 2026 20:09 IST
As Preferred Source 1 min read
జిల్లా పరిషత్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ...

మహిళా ఉద్యోగుల ఆటపాటలతో సందడిగా వేడుకలు...

నల్గొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నల్గొండ జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో, సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి సమక్షంలో నిర్వహించిన సంబరాల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

పూలతో బతుకమ్మల అలంకరణ...

వివిధ రకాల రంగురంగుల పూలతో మహిళా ఉద్యోగులు బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో అలంకరించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. పూల సోయగాలు, సంప్రదాయ గీతాలు, మహిళల ఆటపాటలతో కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు సాంస్కృతిక వేడుకల్లో భాగస్వాములై ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ వేడుకలను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు.

సంప్రదాయాలను భావితరాలకు అందించాలి...

ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ సీఈఓ, అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తరతరాలుగా వస్తున్న పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పరస్పర స్నేహభావం, ఐకమత్యం, ఆత్మీయత మరింత పెరుగుతాయని అన్నారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకే..

తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ సంఘం నల్గొండ జిల్లా శాఖ అధ్యక్షుడు కొప్పు రాంబాబు మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగులంతా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పండుగలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేలా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి అలివేలు మంగమ్మ, పర్యవేక్షకులు బసవోజు, శ్రీనివాసాచారి, సీనియర్‌ అసిస్టెంట్లు హరినాథ్‌, శోభ, జూనియర్‌ అసిస్టెంట్లు ఎండీ గులాం రబ్బాని, రేఖ, రేణుక, భాగ్యవతి, రజిత, విజయభాస్కర్‌, స్నేహ తదితరులతో పాటు కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్‌, యాసీన్‌, అనిల్‌, అభిరామ్‌, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా పరిషత్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి