సూర్యాపేట లో జరిగిన కవులు రచయితల సమావేశంలో సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ఏర్పాటు అయింది.
ఇటీవల సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గ రచయితల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాలుగు నియోజకవర్గాల కార్యవర్గాల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు కవులు రచయితలు కలిసి శనివారం సుధా బ్యాంక్ లో సూర్యాపేట జిల్లా రచయితల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రముఖ కవి రచయిత, సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, ప్రముఖ కవి పిల్లల మరి పినవీరభద్రం కళాపీఠం వ్యవస్థాపకులు శీలా అవిలేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఈ సంఘానికి జిల్లాలోని సీనియర్ రచయిత ఆలేటి శంకర్ ను సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఏర్పడిన జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారులుగా బెల్లంకొండ శ్రీరాములు, గడ్డం నర్సయ్య,
తుమ్మరాజా లను నియమించారు. అదేవిధంగాఉపాధ్యక్షులుగా ధర్మూరి వెంకటేశ్వర్లు, పుప్పాల కృష్ణమూర్తి, ఎర్ర హరికిషన్, సంయుక్త కార్యదర్శులుగా గొడితాల వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, సరికొండ నరసింహారాజు
ప్రచార కార్యదర్శిగా పబ్బతి వెంకటేశ్వర్లు,కార్యవర్గ సభ్యులుగా ముక్కామల జానకి రాములు, ఏబెల్ శశి, ఎన్ .సీ. రోజా, పూసోజు పద్మ, పోతుగంటి వీరాచారి, జిల్లేపల్లి జానయ్య, కొర్రపిడత శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, కొండా లింగారావు, తదితరులను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక రంగంలో కవులు రచయితలను ఒక తాటిపై నడిపి సూర్యాపేట సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేస్తామని నూతన వర్తమాన కవులు రచయితలకు ప్రోత్సాహం ఇస్తూ వారి రచనలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే దిశగా అనేక కార్యక్రమాలు తీసుకుంటామన్నారు. కవిత్వ కార్యశాలలతో పాటు, తెలుగు భాష విస్తృతికి ఉన్నతికి తెలుగు భాషా ఉపాధ్యాయులను కలిసి కృషి చేసేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన కవిత్వ, కథా పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తామని సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ఆ బాధ్యతను తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అనేకమంది కవులు రచయితలు సాహితీప్రియులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి