ఆరెగూడెంలో దెబ్బతిన్న పత్తి పంటల పరిశీలన
రైతులు ఆయిల్ పామ్, పట్టు పరిశ్రమలపై దృష్టి పెట్టాలి
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు సాంప్రదాయ వరి సాగుకు స్వస్తి చెప్పి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ (ఐఏఎస్) సూచించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాత లోటు వల్ల ఎండిపోయిన, వాడిపోయిన పత్తి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో నేరుగా ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా పట్టు పరిశ్రమలను ప్రోత్సహించాలని, పంట ఉత్పత్తులను స్వయంగా విక్రయించుకోవడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేపడితే దీర్ఘకాలికంగా మంచి ఆదాయం లభిస్తుందన్నారు. పత్తి పంట దెబ్బతిని నష్టపోయిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రస్తుత పంటల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని, రైతులు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి కే. హేమలత, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఉద్యాన అధికారిణి కవిత, వ్యవసాయ విస్తరణ అధికారిణి వెన్నెల, నాయకులు ఎన్నపల్లి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ నిమ్మల సత్యనారాయణ, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి